Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెంగళూరు నుంచే జగన్ డైరెక్షన్.. రాష్ట్రంలో గొడవలకు వైసీపీ కుట్ర: ఎస్వీఎస్ఎన్ వర్మ

SVSN Varma Alleges Jagan Directing From Bengaluru And YCP Conspiring For Riots
Advertisement
  • కూటమి ప్రభుత్వంలో రౌడీయిజాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేద‌న్న టీడీపీ నేత‌
  • శాంతియుతంగా స్థానిక ఎన్నికలు.. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వెల్ల‌డి
  • పోలీసు అధికారిపై రోజా దాడి చేయడం దారుణమన్న ఎస్వీఎస్ఎన్ వర్మ
  • బీసీ రిజర్వేషన్లను సైతం జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపణ
Advertisement
మాజీ సీఎం, వైసీపీ అధినేత‌ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచే రాష్ట్రంలో గొడవలకు సూచనలు ఇస్తున్నారని, ఆయన ఆదేశాలతోనే కింది స్థాయి నాయకులు అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. 

నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అత్యంత శాంతియుతంగా, పారదర్శకంగా జరుగుతున్నా.. శాంతిభద్రతలు లోపించాయనే తప్పుడు ప్రచారానికి వైసీపీ తెరలేపిందని విమర్శించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వర్మ అన్నారు. "గతంలో తమ పాలనలో నామినేషన్లు వేయకుండా బెదిరించడం, ఇళ్లలో గంజాయి ప్యాకెట్లు పెట్టి తప్పుడు కేసులు బనాయించడం వంటివి చేసిన చరిత్ర వైసీపీది. కానీ, మా ప్రభుత్వంలో అలాంటి బెదిరింపులకు తావులేదు. 

ప్రజాస్వామ్య విలువలపై టీడీపీకి ఉన్న నమ్మకానికి మాచర్ల నియోజకవర్గమే నిదర్శనం. గతంలో అదే మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడులు జరిగాయి. కానీ, నేడు అదే ప్రాంతంలో వైసీపీ నేతలు ఎలాంటి ఇబ్బంది లేకుండా 36 నామినేషన్లు శాంతియుతంగా వేశారు. ఇదే మా సంస్కృతి" అని వర్మ వివరించారు.

నగరిలో మాజీ మంత్రి రోజా తీరుపై వర్మ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద ఓ పోలీసు అధికారిపై దాడి చేసి, గుండెలపై చేయి వేసి నెట్టడం రౌడీయిజం కాదా అని ప్రశ్నించారు. "ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు ముగ్గురు, నలుగురు మాత్రమే లోపలికి వెళ్లాలి. కానీ, నిబంధనలు ఉల్లంఘించి దౌర్జన్యంగా ప్రవర్తించారు. 

మహిళా నాయకులే ఇలా ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటి?" అని ఆయన నిలదీశారు. అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారమే పనిచేస్తున్నారని, వారి విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

చంద్రబాబు నాయుడు గ్రామ స్థాయి నుంచి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని నమ్ముతారని, బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటే.. జగన్ కోర్టుల ద్వారా దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వర్మ ఆరోపించారు. 

‘చెప్పింది చేస్తాం’ అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల సంపూర్ణ మద్దతు తమకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో పోలీసు వ్యవస్థ బలంగా పనిచేస్తోందని, వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగానే ముగుస్తాయని ఆయన పునరుద్ఘాటించారు.
Advertisement
Advertisement
SVSN Varma
Jagan Mohan Reddy
Andhra Pradesh Local Body Elections
TDP vs YCP
RK Roja Nagari
Chandrababu Naidu

More Telugu News